: చైనా ప్రధానికి మన్మోహన్ శాంతి బోధన


సరిహద్దులలో శాంతి, సామరస్యాలు అత్యంత ముఖ్యమని ప్రధాని మన్మోహన్ సింగ్ చైన్ ప్రధాని లీ కెకియాంగ్ తో చెప్పారు. శాంతికి భంగం వాటిల్లితే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై దాని ప్రభావం పడుతుందన్నారు. ఇటీవల చైనా సైనికులు సరిహద్దులలో చొచ్చుకు వచ్చిన నేపథ్యంలో మన ఆందోళనను మన్మోహన్ తనతో సమావేశమైన చైనా ప్రధానికి తెలియజేశారు. బ్రహ్మపుత్ర నది, సరిహద్దులు, ద్వైపాక్షిక వాణిజ్యం తదితర అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. చైనా ప్రధానిగా లీ కెకియాంగ్ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేశారు. ఆయనకు ఇదే తొలి విదేశీ పర్యటన. అలాగే ప్రధాని మన్మోహన్ తో సమావేశం కావడం కూడా ఇదే ప్రథమం.

  • Loading...

More Telugu News