: కోబ్రా పోస్ట్ లో కేసీఆర్ బామ్మర్ధి
కోబ్రా పోస్ట్ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ బామ్మర్ది మనీల్యాండరింగ్ కు పాల్పడ్డారంటూ బాంబు పేల్చింది. బ్యాంకులు మనీ ల్యాండరింగ్ కు పాల్పడుతున్నాయని విజయవంతంగా బయటపెట్టిన కోబ్రాపోస్ట్ గతంలో శైలజానాథ్ అవినీతికి పాల్పడ్డాడంటూ సంచలనం సృష్టించింది. తాజాగా కేసీఆర్ బామ్మర్ది రామచంద్రరావు ప్రతి ఏడాది 50 లక్షలు తమ బ్యాంకులో జమ చేస్తారంటూ ఐసీఐసీఐ బ్యాంకు మేనేజరు చెప్పిన విషయం వెల్లడించింది. దీంతో టీఆర్ఎస్ లో కలకలం రేగుతోంది.
ఇప్పటికే రఘునందన్ రావు విమర్శలతో కుడితిలో పడ్డ ఎలుకలా తయరైంది టీఆర్ఎస్ పరిస్థితి. ఉద్యమం పేరుతో కోట్లు దండుకుంటున్నారన్న అపవాదును నిజం చేస్తూ కేసీఆర్ బామర్ది ప్రతి ఏడాది భారీగా డబ్బు జమచేసి మనీ ల్యాండరింగ్ కు పాల్పడుతున్నారన్న వార్త ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. దీంతో రామచంద్రరావు కేసీఆర్ కు బామ్మర్ధి కాదని, సన్నిహితుడని ఒక వాదన తెరపైకి వచ్చింది. దీంతో రామచంద్రరావు పరిస్థితి ఎలా ఉన్నా టీఆర్ఎస్ మాత్రం అవినీతి ఆరోపణలతో ఇబ్బంది పడుతోంది.