: జస్ట్ డయల్ పబ్లిక్ ఇష్యూ
దేశీయ సెర్చింజిన్ జస్ట్ డయల్ పబ్లిక్ ఇష్యూ నేడు ప్రారంభమైంది. ఈ నెల 22తో ముగుస్తుంది. కంపెనీ ప్రమోటర్లు 470 నుంచి 543 ధరల శ్రేణిలో 1.749 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. రిటెయిల్ ఇన్వెస్టర్లకు 47 రూపాయల డిస్కౌంట్ కే కేటాయిస్తారు. ఇష్యూ చివరి తేదీనాడు తుది కేటాయింపు ధరను నిర్ణయిస్తారు. క్రిసిల్ దీనికి 5 రేటింగ్ పాయింట్లకు గాను 5 రేటింగ్ ఇచ్చింది. పబ్లిక్ ఇష్యూలో పాల్గొనవచ్చని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా సూచించింది. దేశీయంగా కంపెనీలు, సేవలు, ఉత్పత్తుల సమాచారాన్ని సెర్చింజిన్ ద్వారా తెలియజేసే మరో కంపెనీ లేకపోవడం కంపెనీకి సానుకూల విషయంగా పేర్కొంది.