: వైఎస్ చెప్పినట్లు ఆడారు.. మంత్రుల తప్పేం లేదు: సారయ్య
నాడు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా మంత్రులకు స్వేచ్ఛ లేదని, ఆయన చెప్పిన చోట సంతకాలు పెట్టారని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రులు ధర్మాన, సబితను సారయ్య వెనకేసుకొచ్చారు. వారు ఎటువంటి తప్పూ చేయలేదన్నారు. చెప్పిన చోటల్లా సంతకాలు పెడితే మంత్రులుగా ప్రజలకు ఏం న్యాయం చేసినట్లు మంత్రిగారూ..? అన్న ప్రశ్నకు సారయ్య సమాధానం చెప్పి ఉంటే బావుండేది.