: ఆన్ లైన్ లో తెగిపోతున్న వివాహ బంధాలు
సాంకేతిక పరిజ్ఞానం వల్ల ముస్లింలలో తలాఖ్ లు పెరిగిపోతున్నాయి. గతంలో తలాఖ్ చెప్పాలంటే మత పెద్దల ముందు స్వయంగా చెప్పేవారు. లేదా పత్రాలు పంపేవారు. ఇప్పుడు సెల్ ఫోన్ కు వచ్చిన సందేశంలో తలాఖ్ ఉంటోంది. ఆన్ లైన్ చాటింగ్ లో తలాఖ్ చెప్పేస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయ ముస్లింలు ఈ విధమైన తలాఖ్ లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ లో ఇలాంటి కేసులు అధికమవుతున్నాయి. దీనిపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండడంతో పోలీసులు తల పట్టుకుంటున్నారు. ఇలాంటి తలాఖ్ లకు సాక్ష్యాలుంటే షరియా చట్టం ప్రకారం చెల్లుబాటవుతాయని న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు. దీంతో ముస్లిం మహిళలలో ఆందోళన పెరిగిపోతోంది.