: సింహాచలం గోశాల నుంచి కోడెదూడల చోరీయత్నం
సింహాచల అప్పన్న దేవస్థానం గోశాల మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవలే పదుల సంఖ్యలో కోడెదూడలు మృతి చెందిన ఘటన అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ గోశాల నుంచి 12 కోడెదూడలను కొందరు అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు. అయితే, స్థానికులు గుర్తించి కోడెదూడలను పట్టుకుని తిరిగి దేవస్థానం వారికి అప్పగించారు. దేవస్థానం అధికారుల ఫిర్యాదు మేరకు కోడెదూడలను తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.