: అరుణ గ్రహంపైకి మనమూ వెళ్లొచ్చా...?!


ఖగోళ విశ్వానికి సంబంధించి అందర్నీ ఆకర్షిస్తోంది అరుణ గ్రహం. ఈ గ్రహంపై జీవుల ఉనికి గురించి, ఇతర విషయాల గురించి ప్రపంచ దేశాల్లో ఆసక్తి కలుగుతోంది. దీంతో అంగారకుడిపైకి తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని పంపుతున్నారు. అమెరికా రోవర్‌ను పంపి ఆ గ్రహం గురించి పరిశోధనలు సాగిస్తోంటే మరోవైపు మరో అగ్రదేశం రష్యా కూడా ఆ గ్రహంపై పరిశోధనలు సాగిస్తోంది. రష్యాకు సంబంధించిన కాప్య్సూల్‌ ఒకటి ఒక నెలరోజులకు ముందు అరుణ గ్రహంపైకి పంపబడింది.

బ్రియాన్‌`ఎం అనే ఈ కాప్య్సూల్‌లో ఎలుకలు, నత్తలు, ఇతర అనేక రకాల జంతువులు, పలు రకాల మొక్కల్ని ఉంచి అంగారకుడి పైకి రష్యా పంపింది. ఈ కాప్య్సూల్‌ ఒక నెల తర్వాత ఆదివారం నాడు ప్రత్యేక పారాచూట్‌ సహాయంతో ఆరెన్‌బర్గ్‌ ప్రాంతంలో దిగింది. అయితే ఈ కాప్య్సూల్‌లో కొన్ని చనిపోయాయని రష్యా అధికారిక టివి ఛానెల్‌ పేర్కొంది. ఎక్కువ కాలంపాటు సొంతంగా జీవించేలా అంతరిక్షంలోకి జంతువులను పంపడం ఇదే మొదటిసారి అని రష్యా అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌ కు చెందిన వ్లాదిమిర్‌ సిచోవ్‌ చెబుతున్నారు. భారరహిత స్థితికి శరీరం ఎలా స్పందిస్తుంది? అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టినట్టు ఆయన చెబుతున్నారు. ఈ ప్రయోగం ద్వారా లభించిన సమాచారంతో అంగారకుడిపైకి మానవులతో కూడిన యాత్ర చేపట్టడానికి వీలు కలుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News