Amaravati: అమరావతి భూముల కొనుగోళ్ల అంశంపై ఐటీ చీఫ్ కమిషనర్ కు ఏపీ సీఐడీ లేఖ

  • లేఖ రాసిన ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ సునీల్ కుమార్
  • అమరావతి అసైన్డ్ భూముల కొనుగోళ్లపై విచారణ జరపాలంటూ వినతి
  • భూముల వివరాలు సర్వే నెంబర్ల సహా లేఖలో వెల్లడించిన వైనం

అమరావతి భూముల అంశంపై ఐటీ చీఫ్ కమిషనర్ కు ఏపీ సీఐడీ అదనపు డైరెక్టర్ సునీల్ కుమార్ లేఖ రాశారు. అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలుపై విచారణ జరపాలని ఆ లేఖలో కోరారు. 2018 నుంచి 2019 వరకు 106 మంది నుంచి కొనుగోలు చేసిన భూములపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. రూ.2 లక్షలకు మించిన లావాదేవీలపై విచారణ చేపట్టాలని కోరారు. ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఐడీ తన లేఖలో విజ్ఞప్తి చేసింది. అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో ఉన్న వ్యక్తుల పూర్తి వివరాలు, భూముల చిరునామా, సర్వే నెంబర్లతో సహా ఈ లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News