: ఆ బొమ్మ వెల పది కోట్లట...!


ఏదైనా ఒక చిత్రం వెల... మార్కెట్లో ఎంతుంటుంది... ఆ చిత్రాన్ని వేసిన చిత్రకారుడిని బట్టి వుంటుంది... అయితే ఈ చిత్రం వెల మాత్రం చిత్రకారుడి పేరునుబట్టి కాదుగానీ... వేలం పాటలో మాత్రం దీని ఖరీదు సుమారు పది కోట్ల ధర పలికింది....! దివంగత నటి బీట్రైస్‌ ఆర్థర్‌ చిత్రాన్ని జాన్‌ కరిన్‌ అర్ధనగ్నంగా చిత్రించారు. ఈ చిత్రాన్ని వేలం పాటలో రూ.10.42 కోట్లకు ఎవరో అజ్ఞాత వ్యక్తి కొనుగోలు చేశారు.

‘బీ ఆర్థ్రర్‌ నేకెడ్‌’ పేరుతో చిత్రించిన ఈ చిత్రానికి ఇంత ధర వెచ్చించి కొనుగోలు చేసిన వారు వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ చిత్రాన్ని 1991లో ఆయిల్‌ పెయింట్లతో చిత్రించారు. బీట్రస్‌ బ్రైట్‌ క్యాన్సర్‌తో పోరాడుతూ 2009లో మరణించారు.

  • Loading...

More Telugu News