Jagan: సీఎం జగన్‌ నిర్ణయంపై ప్రశంసల జల్లు కురిపించిన 'ది హిందూ' గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌. రామ్‌

  • ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన భేష్
  • ఇదో చారిత్రాత్మక నిర్ణయం
  • నాణ్యమైన విద్య అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది
  • విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంలో విద్యా బోధన చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయంపై  ది హిందూ గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌. రామ్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఇదో చారిత్రాత్మక నిర్ణయమని, నాణ్యమైన విద్యను అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పారు.

ఈ రోజు విజయవాడలోని గేట్‌వే హోటల్‌ల్లో 'ది హిందూ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌' కార్యక్రమంలో జగన్ ముఖ్య అతిథిగా హాజరై ఏపీలో తాము తీసుకుంటున్న నిర్ణయాలను వివరించి చెప్పిన విషయం తెలిసిందే. అనంతరం ది హిందూ గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ రామ్‌ మాట్లాడారు.

ఏపీలో విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టి జగన్ మంచి పని చేస్తున్నారని ఎన్.రామ్ అన్నారు. గతంలో పాదయాత్ర సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రం ఏపీయే అని గుర్తు చేశారు. సామాజికంగా వెనుకబడ్డ పిల్లలు ఇంగ్లిష్ మీడియం విద్య వల్ల లబ్ధి పొందుతారని అన్నారు.

  • Loading...

More Telugu News