: తల్ల'ఢిల్లి'న డేర్ డెవిల్స్
ఐపీఎల్-6ను ఢిల్లీ డేర్ డెవిల్స్ ఓటమితో ముగించారు. పుణే వారియర్స్ తో ఈ సాయంత్రం జరిగిన మ్యాచ్ లో డెవిల్స్ 38 పరుగుల తేడాతో పరాజయంపాలయ్యారు. మొదట బ్యాటింగ్ చేసిన పుణే 5 వికెట్లకు 172 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో ఢిల్లీ 9 వికెట్లకు 134 పరుగులే నమోదు చేయడంతో పరాభవం తప్పలేదు. పుణే బౌలర్లలో మాథ్యూస్, ముర్తజా చెరో 3 వికెట్లతో డేర్ డెవిల్స్ పనిబట్టారు. ఈ విజయంతో పుణే పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకోగా.. ఢిల్లీ చివరి స్థానానికి పరిమితమైంది. పుణే 16 మ్యాచ్ లాడి నాలుగింట గెలవగా.. ఢిల్లీ 16 మ్యాచ్ లాడి 3 మ్యాచ్ లలో విజయం సాధించింది.