: సీఎం కిరణ్ కు వీహెచ్ సలహా
రాష్ట్ర క్యాబినెట్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల తొలగింపుపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకుంటేనే ప్రజలు హర్షిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అంటున్నారు. కేంద్రంలో కళంకితులుగా ముద్రపడ్డ బన్సల్, అశ్వినీ కుమార్ లను తప్పించారని, రాష్ట్రంలోనూ కేంద్రం ఆలోచనలనే అమలు చేయాలని వీహెచ్.. సీఎంకు సూచించారు. ఆదర్శ్ స్కాంపై కోర్టులో విచారణ సాగుతున్నప్పుడే.. ఆ వ్యవహారంతో సంబంధం ఉన్న అశోక్ చవాన్ ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించారని ఆయన గుర్తు చేశారు.