: ఫిక్సింగ్ వ్యవహారంలో మరో ముగ్గురి అరెస్టు
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో పోలీసు దర్యాప్తు జెట్ స్పీడుతో సాగుతోంది. ఇప్పటికే శ్రీశాంత్, చండీలా, చవాన్ లను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు.. తాజాగా ఔరంగాబాద్ లో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ మాజీ రంజీ ఆటగాడు కూడా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. నేడు అరెస్టు చేసిన ఆటగాళ్ళు సునీల్, మనీష్, కిరణ్ అని తెలుస్తోంది. మరో రంజీ ఆటగాడిపై కూడా పోలీసులు నిఘా వేసినట్టు సమాచారం.