Jagan: 'మండలి రద్దు' నేపథ్యంలో మంత్రులు పిల్లి సుభాష్, మోపిదేవికి జగన్ హామీ?

  • మండలి రద్దు నిర్ణయంతో  కీలక పరిణామం
  • మండలి రద్దయితే వీరిద్దరి కేబినెట్ బెర్త్ ఆరు నెలల వరకే
  • పార్టీలో ప్రాధాన్యం ఉంటుందన్న జగన్

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణ.. ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు శాసనమండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో వీరి మంత్రి పదవులపై చర్చ జరుగుతోంది. ఒకవేళ మండలి రద్దయితే వీరిద్దరు ఆ పదవుల్లో ఆరు నెలల వరకే కొనసాగే అవకాశం ఉంటుంది. అనంతరం మంత్రి పదవులు వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ ఇద్దరికీ అండగా ఉంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. మంత్రి పదవులు లేకపోయినా పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని వైసీపీ నేతలు చెప్పారు.  

 

 

  • Loading...

More Telugu News