YSRCP: ఏపీ అసెంబ్లీ ప్రారంభం... కాసేపు వాయిదా
- చర్చ జరగాల్సిన అంశాల వివరాలను తెలిపిన స్పీకర్
- కాసేపట్లో బీఏసీ సమావేశం ప్రారంభం
- తర్వాత తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే కాసేపు వాయిదా పడ్డాయి. అంతకు ముందు అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అంశాలను స్పీకర్ తమ్మినేని సీతారాం వివరించి చెప్పారు. కాసేపట్లో బీఏసీ సమావేశం ప్రారంభం కానుంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత తిరిగి అంసెబ్లీ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అసెంబ్లీ ప్రారంభం కాగానే శాసనమండలి రద్దు ప్రతిపాదనపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. అనంతరం దీనిపై చర్చించి, ఆమోదం తెలిపి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు.