Bhadradri Kothagudem District: రాములోరి కల్యాణం... ఏప్రిల్‌ 2న పెళ్లికొడుకు కానున్న భద్రాద్రి రామయ్య

  • మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 8 వరకు నవమి ఉత్సవాలు
  • 30న గరుడాధివాసం...ఒకటిన ఎదుర్కోలు
  • వివరాలు తెలంగాణ ప్రభుత్వానికి పంపిన ఈఓ నరసింహులు

భద్రాద్రి రామయ్య పెళ్లికొడుకు అవుతున్నాడు. ఏప్రిల్‌ 2న సీతారాముల కల్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను దేవస్థానం ఈవో నరసింహులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ వివరాల మేరకు మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 8 వరకు నవమి ఉత్సవాలు నిర్వహిస్తారు.

 బ్రహ్మోత్సవాల కారణంగా  ఈ రోజుల్లో నిత్య కల్యాణం ఉండదు. మార్చి 29 నుంచి 8వ తేదీ వరకు దర్బారు సేవ కూడా రద్దుకానుంది. మార్చి 29న కల్యాణోత్సవానికి అంకురార్పణ జరుగుతుంది. 30వ తేదీన గరుడాధివాసం నిర్వహిస్తారు. 31న అగ్నిని ప్రతిష్ఠించి దేవతలను ఆహ్వానిస్తారు. ఏప్రిల్‌ ఒకటిన ఎదుర్కోలు జరుగుతుంది. రెండో తేదీన శ్రీరామనవమి సందర్భంగా రాములోరి కల్యాణం జరగనుంది. అదేరోజున శ్రీరామపునర్వసు దీక్షలు ప్రారంభించి మూడున పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం రోజు రథోత్సవం ఉంటుంది.

More Telugu News