: గుంటూరు డీసీసీబీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి 22 జిల్లాల్లో జరగనున్న డీసీసీబీ (జిల్లా సహకార కేంద్ర బ్యాంకు) ఎన్నికలు రసవత్తరంగా మారిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో గుంటూరులో జరగాల్సిన డీసీసీబీ ఎన్నికలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగు వారాలపాటు ఇక్కడ ఎన్నికలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రెండు వారాల్లోగా కౌంటరు దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.