Telugudesam: జగన్ ఒక ఆర్థిక ఉన్మాది.. ఆర్థిక ఉగ్రవాది!: చంద్రబాబునాయుడు ఫైర్
- రాష్ట్రాన్ని జగన్ అపహాస్యం చేయాలనుకుంటున్నారు
- జగన్ ని చూసి మేము భయపడిపోవాలా?
- మేము సరెండర్ అయిపోవాలా?
సీఎం జగన్ ఒక ఆర్థిక ఉన్మాది, ఆర్థిక ఉగ్రవాది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'రాష్ట్రాన్ని అపహాస్యంపాలు చేయాలనుకుంటున్న జగన్ ని చూసి మేము భయపడిపోవాలా? సరెండర్ అయిపోవాలా?' అని ప్రశ్నించారు. రాజ్యాంగంలో ‘క్యాపిటల్’ అనే పదమే లేదని, హుద్ హుద్ తుపాన్ వచ్చినప్పుడు విశాఖలో కూర్చుని చంద్రబాబు పరిపాలించలేదా? నాడు తమిళనాడు సీఎం జయలలిత ఊటీ నుంచి పాలించలేదా? అంటూ నిన్న అసెంబ్లీలో జగన్ ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్ మాట్లాడే మాటలకు పొంతనే లేదని బాబు విమర్శించారు.