YSRCP: వైసీపీ మంత్రులు మండలి ఛైర్మన్ షరీఫ్‌పై దాడి చేసి, లోకేశ్‌పై దౌర్జన్యం చేశారు: చంద్రబాబు
- మండలిలో ఛైర్మన్ పోడియం ఎక్కి పేపర్లు చించారు
- ఈ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్సీలను ఏం చేయాలి?
- టీడీపీ ఎమ్మెల్సీలు రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు
- అనుభవజ్ఞుడి అండ ఎంత అవసరమో యనమల నిరూపించారు
వైసీపీ మంత్రులు మండలి ఛైర్మన్ షరీఫ్‌పై దాడి చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన కుమారుడు లోకేశ్‌పై ముగ్గురు మంత్రులు దౌర్జన్యం చేశారని తెలిపారు. మండలిలో ఛైర్మన్ పోడియం ఎక్కి పేపర్లు చించిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్సీలను ఏం చేయాలి? అని ఆయన ప్రశ్నించారు.
టీడీపీ ఎమ్మెల్సీలు రాష్ట్ర భవిష్యత్తును కాపాడారని చంద్రబాబు నాయుడు అన్నారు. అనుభవజ్ఞుడి అండ ఎంత అవసరమో యనమల రామకృష్ణుడు నిరూపించారని ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన అనుభవం, ఆయనకున్న పరిజ్ఞానం వల్ల ఏపీలో ప్రజాస్వామ్యానికి జీవం పోసినట్లయిందని చంద్రబాబు చెప్పారు. టీడీపీ యువ ఎమ్మెల్సీల ధైర్యం, తెగువ ప్రశంసనీయమని ఆయన కొనియాడారు.