Telugudesam: టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే: అసెంబ్లీలో వైసీపీ సభ్యులు
- టీడీపీ సభ్యుల తీరు సరికాదు
- స్పీకర్ను, సీఎం జగన్ను అవమానిస్తే ప్రజలు ఊరుకోబోరు
- చట్టసభలకు విలువ ఉండదు
- సీఎంపై టీడీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేశారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేస్తుండడంతో వైసీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలపై చర్చ జరుగుతుండగా అడ్డుపడిన టీడీపీ సభ్యుల తీరు సరికాదని వైసీపీ సభ్యుడు సుధాకర్ బాబు అన్నారు. జగన్పై నమ్మకం ఉంచే ప్రజలు తమకు ఓట్లు వేశారని ఆయన అన్నారు.
సభలో స్పీకర్ను, సీఎం జగన్ను అవమానిస్తే ప్రజలు ఊరుకోబోరని, అలాగే చట్టసభలకు విలువ ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. గూండాలు చట్టసభల్లోకి వచ్చారంటూ వ్యాఖ్యానించారు. సీఎంపై టీడీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు.