: దివి నుంచి భువికి తిరిగొచ్చిన ఎలుకలు, నత్తలు!


శాస్త్రవేత్తలు ఊరకుండరు కదా! ఏవో ప్రయోగాలతో నిరంతరం నూతన ఆవిష్కరణల కోసం పరితపిస్తుంటారు. ఇటీవల, అంగారకుడిపై జీవం మనుగడకు ఆస్కారం ఉందో లేదో అని నిర్ధారించుకునేందుకు రష్యా పరిశోధకులు కొన్ని ఎలుకలు, నత్తలను ఆ అరుణ గ్రహంపైకి పంపారు. ఆ నెల రోజుల మిషన్ పూర్తి కావడంతో ఆ చిరు ప్రాణులను తీసుకెళ్ళిన స్పేస్ కాప్స్యూల్ సురక్షితంగా భూమికి తిరిగొచ్చింది.

శాస్త్రజ్ఞులు ప్రస్తుతం ఆ ప్రాణుల్లో ఎన్ని బతికున్నాయో, ఎన్ని ప్రాణాలు కోల్పోయాయో తేల్చే పనిలో పడ్డారట. ఈ పరిశోధన అంగారకుడిపైకి మానవుడిని పంపేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు రష్యన్ సైంటిస్టులు. వీరికి నాయకత్వం వహిస్తున్న వాలెరీ అబ్రాష్కిన్ మాట్లాడుతూ, అరుణగ్రహంపై జీవులు భారరహితస్థితికి అనువుగా తమ దేహాలను ఎలా మార్చుకుంటాయన్నది ఈ పరిశోధనలతో వెల్లడవుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News