: 'ఆల్ రైట్స్ రిజర్వ్ డ్' అంటోన్న టి. సుబ్బరామిరెడ్డి
ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి విశాఖపట్నంపై సర్వహక్కులు తనవే అంటున్నారు. 2014 ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 2009 ఎన్నికల్లో పురందేశ్వరి విశాఖ సీటు కోరుకోగా, తానే అధిష్ఠానానికి ఆమె పేరు సిఫారసు చేశానని సుబ్బరామిరెడ్డి వివరించారు. అప్పట్లో ఆమె తాత్కాలిక ప్రాతిపదికనే విశాఖ ఎంపీ అయ్యారని, వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి బరిలో దిగేందుకు ఇష్టపడుతున్నారని సుబ్బరామిరెడ్డి తెలిపారు.