: పార్లమెంటులో నీలం, పీవీ విగ్రహాల ఏర్పాటు: సీఎం


రాష్ట్రానికి, దేశానికి విశేష సేవలందించిన నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావుల విగ్రహాలను పార్లమెంట్ లో ఏర్పాటు చేయాలని కోరుతూ స్పీకర్ మీరా కుమార్ కు లేఖ రాస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన నీలం సంజీవరెడ్డి శత జయంతి వేడుకలలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. నీలం సేవలను కొనియాడారు. అనంతపురంలోని మెడికల్ కళాశాలకు, రాష్ట్ర రెవెన్యూ అకాడమీకి ఆయన పేరును పెడతామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News