: కొత్త పోప్ ఎన్నికలో ఐదుగురు భారతీయులకు ఓటు హక్కు
కొత్త
పోప్ ఎన్నికలో పాల్గొనే అరుదైన అవకాశం ఐదుగురు భారతీయ కార్డినల్స్
కు దక్కింది. భారతీయ చర్చి చరిత్రలో ఐదుగురు కార్డినల్స్ కు పోప్
ఎన్నికలో ఓటేసే చాన్స్ లభించడం ఇదే మొదటిసారి అని కేరళ క్యాథలిక్ కౌన్సిల్
ఫాదర్ స్టీఫెన్ అలధారా చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 117 మంది
కార్డినల్స్ మార్చి 24 నుంచి ఆరంభమయ్యే 'పవిత్ర వారం'లో నూతన
పోప్ ఎన్నికల్లో పాల్గొంటారు.