సీఎం జగన్ గారూ! ‘అమ్మఒడి’ అంటూ భారీ బొమ్మ చూపించారు: నారా లోకేశ్

బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, గిరిపుత్రులకు చెందాల్సిన నిధులను పక్కదారి పట్టించారని, ‘అమ్మఒడి’ అంటూ భారీ బొమ్మ చూపించారంటూ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించాల్సిన రూ.442 కోట్లు అటకెక్కాయని, గిరిపుత్రులకు చెందాల్సిన రూ.395 కోట్లు గంగలో కలిసిపోయాయని, బడుగు, బలహీన వర్గాలకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టించి రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు.


More Telugu News