Chandrababu: దొండపాడులో ఒక రైతు గుండెపోటుతో చనిపోయారు: మీడియా సమావేశంలో చంద్రబాబు
- రైతులు త్యాగాలు చేసి భూములు ఇచ్చారు
- మహిళలపై నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
- ప్రభుత్వ తీరు వల్ల అమాయకులు బలవుతున్నారు
- రైతులిచ్చిన భూములకు న్యాయం చేయాల్సిన బాధ్యత రైతులకు ఉంది
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం 18 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు మంగళగిరిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రైతులు త్యాగాలు చేసి భూములు ఇచ్చారని అన్నారు. దొండపాడులో ఒక రైతు గుండెపోటుతో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
'మహిళలపై నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ తీరు వల్ల అమాయకులు బలవుతున్నారు. రైతులిచ్చిన భూములకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. బీజీసీ కమిటీ ఎప్పుడు వేశారో చెప్పలేదు. మీకు నచ్చిన విధంగా ఆ కమిటీ రిపోర్టు ఇచ్చింది' అని చంద్రబాబు చెప్పారు.
'తప్పుడు నివేదికలతో మోసం చేయడం సరికాదు. క్లయింటు వద్ద డబ్బులు తీసుకొని, వారికి ఇష్టం వచ్చిన రిపోర్టులు ఇచ్చే సంస్థ వంటిదే బీసీజీ. విజయసాయిరెడ్డి అల్లుడితో ఆ కమిటీకి సంబంధం ఉంది. అటువంటి కమిటి ఇచ్చిన నివేదికకు విశ్వసనీయతలేదు. ఎవరిని మోసం చేయడానికి హైపర్ కమిటీ వేస్తున్నారు' అని చంద్రబాబు చెప్పారు.