YSRCP: అందుకే ప్రజలు చంద్రబాబును తరిమి కొట్టారు: విజయసాయిరెడ్డి విమర్శలు
- ఐదేళ్ల మీ పాలనలో దోపిడీ, అరాచకాలకు అంతేలేదు
- రావణ కాష్టంలా ఏపీని మండించాడు
- ఇప్పుడు మొసలి కన్నీరు కార్చుతున్నాడు
- పగటి వేషగాడిలా చంద్రబాబు మారిపోయాడు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చంద్రబాబు పర్యటనను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు. 'నిప్పుల కుంపటి కాదు చంద్రబాబూ. ఐదేళ్ల మీ పాలనలో దోపిడీ, అరాచకాలకు అంతేలేదు. రావణ కాష్టంలా మండించావు రాష్ట్రాన్ని. అందుకే ప్రజలు తరిమి కొట్టారు' అని ఆయన ట్వీట్ చేశారు.
అమరావతి చుట్టూ నాలుగు గ్రామాల్లో మొసలి కన్నీరు కార్చుతూ పగటి వేషగాడిలా చంద్రబాబు మారిపోయారని విజయసాయిరెడ్డి విమర్శించారు. రియల్ ఎస్టేట్ దళారి స్థాయికి ఆయన దిగజారి పోయారని ట్వీట్ చేశారు.