: రఘునందన్ పై మండిపడ్డ కేటీఆర్


టీఆర్ఎస్ బహిష్కృత నేత రఘునందన్ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఎట్టకేలకు పెదవి విప్పారు. పార్టీపైనా, ముఖ్యంగా హరీశ్ రావుపై రఘునందన్ గత రెండ్రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో.. కేటీఆర్ స్పందించారు. రఘునందన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేదిలేదని, పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. రఘునందన్ విషయంలో మీడియా అనవసర ప్రాధాన్యమిస్తోందని ఆరోపించారు. మీడియాలో వస్తున్నట్టుగా తమ కుటుంబంలో ఎలాంటి పొరపొచ్చాలు రాలేదని వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News