New Year Celebrations: న్యూ ఇయర్ వేడుకలు.. హైదరాబాద్ పోలీసుల కండిషన్లు!

  • రేపు రాత్రి నుంచి న్యూ ఇయర్ వేడుకలు
  • వేడుకలను సంతోషంగా జరుపుకోవాలన్న పోలీసు శాఖ
  • శాంతిభద్రతలకు విఘాతం కలిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిక

ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిన 2019 సంవత్సరం మరో రోజులో ముగియబోతోంది. మరెన్నో ఆశలు, ఆకాంక్షలు, అంచనాలు, ఆలోచనలు, సరికొత్త కార్యాచరణలతో 2020 మన ముందుకు రాబోతోంది. 2020ని సాదరంగా ఆహ్వానించేందుకు ప్రతి ఒక్కరూ తమతమ కుటుంబాలతోనో, స్నేహితులతోనో కలసి ఎవరికి తోచిన విధంగా వారు ప్లాన్ చేసుకుని ఉంటారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే... అప్పుడే న్యూ ఇయర్ జోష్ కనిపిస్తోంది. మరోవైపు, న్యూఇయర్ వేడుకల విషయంలో హైదరాబాద్ పోలీసులు పలు సూచనలు చేశారు.

అందరూ నూతన సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని చెబుతూనే... శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎక్కడా గీత దాటవద్దని, తోటి వారిని ఇబ్బంది పెట్టవద్దని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలు కండిషన్లు పెట్టారు. ఆ కండిషన్లు ఏమిటో చూద్దాం.

  • మైనర్లను బార్లు, వైన్ షాపుల్లోకి అనుమతించొద్దు.
  • పార్టీ కోసం వచ్చేవారు గొడవ చేయకుండా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలి. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవాలి.
  • పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. అడ్డదిడ్డంగా రోడ్లపై పార్కింగ్ చేస్తే సహించేది లేదు.
  • వైన్ షాపులకు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లకు ఒంటి గంట వరకు మాత్రమే అనుమతి.
  • సమయానికి బార్లు, వైన్ షాపులను మూసివేయకపోతే నిర్వాహకులపై కేసుల నమోదు.
  • హాస్టళ్ల ముందు మద్యం సేవించి, వేడుకలను నిర్వహిస్తే చర్యలు.
  • డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహణ.
  • అతిగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు.
  • పోలీసుల నిబంధనలను పాటించని వారిపై కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తాం.

More Telugu News