: బీసీసీఐ సమావేశం నేడే.. క్రికెటర్లపై జీవితకాల నిషేధం?
భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు అత్యవసర సమావేశం ఈ రోజు చెన్నైలో జరగనుంది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్ అరెస్టయిన నేపథ్యంలో బీసీసీఐ సమావేశమవుతోంది. అరెస్టయిన ముగ్గురు క్రికెటర్లు కూడా తాము తప్పు చేశామని విచారణలో వెల్లడించిన నేపథ్యంలో వారిపై జీవిత కాల వేటు వేసే విషయాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ రోజు సమావేశంలో దీనిపై ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే క్రికెటర్లలో వణుకు పుట్టించే పలు కఠిన నిర్ణయాలు కూడా వెలువడవచ్చని అంటున్నారు.