Kamal Nath: మా ఆందోళన అంతా దీని గురించే: కమల్ నాథ్

  • సీఏఏపై మోదీ, అమిత్ షా ఏం మాట్లాడుతున్నారనేది అనవసరం
  • చట్టంలో ఏం పెట్టలేదనేదే అసలైన ప్రశ్న
  • చట్టం దుర్వినియోగమైతే ఏంటనేదే ఆందోళన

పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేసేందుకే దీన్ని తీసుకొచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మీడియాతో మాట్లాడుతూ, దీనిపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి ఏం చెబుతున్నారనేది తమకు అనవసరమని చెప్పారు. ఇద్దరూ వేర్వేరు విషయాలపై మాట్లాడుతున్నారని అన్నారు. ఈ చట్టంలో ఏం పెట్టారనేది ప్రశ్న కాదని... చట్టంలో ఏం పెట్టలేదనేదే ప్రశ్న అని చెప్పారు. ఈ చట్టం దేనికి ఉపయోగపడుతుందనేది ప్రశ్న కాదని... అది దుర్వినియోగమైతే పర్యవసానాలు ఏమిటనేదే ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

More Telugu News