: రాబోయే సౌర తుపానుతో భూమికి ముప్పు
సూర్యగోళంపై నిత్యం చెలరేగుతూ ఉండే మంటలు.. ఈ ఏడాదిలో మరింతగా విజృంభించనున్నాయిట. అదే సమయంలో.. ఈ ఏడాదిలోనే అతి పెద్దదిగా నమోదు కానున్న సౌరతుపాను వలన రాబోయే రోజుల్లో భూమండలానికి కూడా ముప్పు పొంచి ఉన్నదట. శాస్త్రవేత్తలు, అత్యంత శక్తిమంతమైన, క్లాస్ ఎక్స్ గా పరిగణించదగిన... సౌరతుపానుకు బీజం వేసే ఒక సన్‌స్పాట్‌ను కనుగొన్నారు.
ఈ సౌరతుపాను నేరుగా భూమికి ఏమీ నష్టం కలిగించకపోయినప్పటికీ... అది జీపీఎస్ నేవిగేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్లు, పవర్ గ్రిడ్‌లను తాత్కాలికంగా దెబ్బ తీయవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
సౌర అగ్ని కీలలను మూడు రకాలుగా వర్గీకరిస్తారు. సి అంటే బలహీనమైనవని, ఎం అంటే మధ్యస్తమైనవని, ఎక్స్ అంటే అత్యంత శక్తిమంతమైనవని లెక్కిస్తారు. ఎక్స్ తరగతికి చెందినవి దీర్ఘకాలంపాటూ భూమి ఎగువ వాతావరణంపై సుదీర్ఘకాలం పాటూ రేడియేషన్ తుపానుల ప్రభావం చూపిస్తాయి. ధార్మిక బ్లాక్‌అవుట్‌లకు దారితీస్తాయి.