Sensex: వారాన్ని నష్టాలతో ప్రారంభించిన మార్కెట్లు

  • రోజంతా నష్టాల్లోనే పయనించిన మార్కెట్లు
  • 38 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 5 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ఆసాంతం మార్కెట్లు నష్టాల్లోనే పయనించాయి. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సెన్సెక్స్ దాదాపు 180 పాయింట్లు నష్టపోయింది. అయితే మార్కెట్లు చివర్లో పుంజుకుని నష్టాలను తగ్గించుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 38 పాయింట్లు కోల్పోయి 41,642కి పడిపోయింది. నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 12,266 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వేదాంత లిమిటెడ్ (2.36%), మారుతి సుజుకి (1.59%), హీరో మోటోకార్ప్ (1.23%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.10%), ఏసియన్ పెయింట్స్ (0.78%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-3.51%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.88%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.61%), టెక్ మహీంద్రా (-1.01%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.00%).

More Telugu News