Nizamabad District: ఉంగరం గొంతులో ఇరుక్కోవడంతో విలవిల్లాడిపోయిన ఐదు నెలల చిన్నారి

ఐదు నెలల బాలుడు ఉంగరాన్ని మింగేసిన ఘటన నిజామాబాద్‌ పట్టణంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు చేతికి పెట్టిన ఉంగరాన్ని ఆడుకుంటోన్న సమయంలో యాసిన్ అనే బాలుడు మింగేశాడు. దీంతో అది అతడి గొంతులో ఇరుక్కుంది. ఈ విషయాన్ని గుర్తించిన అతడి తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం వెంటనే అతడిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆసుపత్రిలో వైద్యులు ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించడంతో ఆ బాలుడి గొంతులో ఉంగరం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే చికిత్స చేసిన  వైద్యులు ఉంగరాన్ని తొలగించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. చిన్నారి యాసిన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.

Nizamabad District
ring

More Telugu News