Chandrababu: మనిషి మారతాడనుకుంటే ఏం మారలేదు!: సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శ
- ఒక్కో వైసీపీ ఎమ్మెల్యే ఉన్మాదిగా తయారయ్యారు
- సీఎం జగన్ కూడా అదే కోవలో వెళుతున్నారు
- మీ ఇష్ట ప్రకారం చేస్తే వడ్డీతో సహా చెల్లించే రోజు తొందరలోనే వస్తుంది
ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టి జగన్ ముఖ్యమంత్రి అయ్యారని, ఎన్నికల తర్వాత మనిషి మారతాడని ఆశిస్తే అలాంటి మార్పు ఏమీ లేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. అనంతపురంలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి లాంటి వ్యక్తులను ఆర్థికంగా దెబ్బతీయాలని, పయ్యావుల కేశవ్ అమరావతిలో భూములు కొనుగోలు చేశారని దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు.
ఒక్కో వైసీపీ ఎమ్మెల్యే ఉన్మాదిగా తయారయ్యారని, ముఖ్యమంత్రి జగన్ కూడా అదే కోవలో వెళుతున్నారని నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సమావేశాలకు తనను రానీయకుండా గేటు వద్ద ఓ చీఫ్ మార్షల్ అడ్డుపడ్డారని, ఆ మార్షల్ ను నిలదీసి లోపలికి వెళితే ‘ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి.. నేను ‘బాస్టర్డ్’ అన్నానని అబద్ధం చెబుతాడా? పనికిమాలిన వ్యక్తి. ఇతనికి విలువే లేదు. ఏదైనా తమాషా అనుకుని మీ ఇష్ట ప్రకారం చేస్తే వడ్డీతో సహా మళ్లీ చెల్లించే రోజు తొందరలోనే వస్తుంది’ అని హెచ్చరించారు.