: తిరుపతి, కరీంనగర్ మధ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్


ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి, కరీంనగర్ మధ్య కొత్త సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 22న తిరుపతిలో ఈ రైలును లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ ఎక్స్ ప్రెస్ వారానికి ఓసారి మాత్రమే ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన విధంగానే తిరుపతి, కరీంనగర్ మధ్య రైలును నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు పేర్కొన్నారు. ఈ రైలు తిరుపతిలో బుధవారం రాత్రి 10.40కి.. కరీంనగర్ నుంచి గురువారం రాత్రి 7.15కి బయల్దేరుతుంది.

  • Loading...

More Telugu News