YSRCP: విపక్ష నాయకుడి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా?: సోమిరెడ్డి ఫైర్

  • అసెంబ్లీకి వస్తుంటే చంద్రబాబును అడ్డుకోవడంపై మండిపాటు 
  • ట్విట్టర్ వేదికగా వైసీపీ పై ఆగ్రహం
  • ఇదేం రాజకీయమని ప్రశ్న

రాష్ట్రంలో సీనియర్ నాయకుడు, పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం విపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు పట్ల అధికార పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా? అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

రెండు రోజుల క్రితం చంద్రబాబు సహా అసెంబ్లీకి వస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మార్షల్స్ అడ్డుకుని గేటుకు తాళం వేసిన నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదికగా అధికార పార్టీపై మండిపడ్డారు. గతంలో చంద్రబాబు ఇంటి గేటుకే తాళం వేసి నిర్బంధించారని, ఇప్పుడు అసెంబ్లీలోకే రానివ్వకుండా అడ్డుకున్నారని, ఇదేం రాజకీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అధికార పార్టీ దారుణమైన రాజకీయం నడుపుతోందన్నారు. అసెంబ్లీ వద్ద చీఫ్ మార్షల్ నుంచి గ్రామాల్లో కాని స్టేబుల్ వరకు అందరి తీరు ఒకేలా ఉందన్నారు. దీన్నిబట్టే ప్రభుత్వ పాలన ఎలా వుందో అర్థమవుతోందని, దీనికి ముగింపు ఎప్పుడని ఆయన ప్రశ్నించారు.

More Telugu News