chennai: ఆదివారం చెన్నైలో గొల్లపూడి భౌతికకాయానికి అంత్యక్రియలు

- చెన్నైలోని లైఫ్ లైన్ ఆస్పత్రిలో మృతి చెందిన గొల్లపూడి
- ఇవాళ, రేపు ఆయన భౌతికకాయం ఆసుపత్రిలోనే
- శనివారం చెన్నైలోని నివాసానికి పార్థివదేహం తరలింపు
చెన్నైలో మృతి చెందిన ప్రముఖ సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు భౌతికకాయానికి ఆదివారం చెన్నైలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చెన్నైలోని లైఫ్ లైన్ ఆస్పత్రిలో గొల్లపూడి ఈరోజు మృతి చెందారు. ఇవాళ, రేపు ఆయన భౌతికకాయాన్ని ఆసుపత్రిలోనే ఉంచి, శనివారం నివాసానికి తరలిస్తారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.