: అధికారంలోకి వస్తే తొలి తీర్మానం తెలంగాణపైనే: ఎర్రబెల్లి


టీడీపీ వరంగల్ జిల్లా జనగామలో మినీ మహానాడు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే తొలి తీర్మానం తెలంగాణపైనే చేయిస్తామని తెలిపారు. పార్టీ నుంచి ఎంతమంది నేతలు వెళ్లినా ఎలాంటి నష్టమూ లేదని స్పష్టం చేసారు. తెలంగాణ కోసం అనుకూలంగా లేఖ ఇచ్చిన తమపై విమర్శలు చెయ్యడం సరికాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News