Chandrababu: చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలను అడ్డుకున్న సెక్యూరిటీ
- ప్లకార్డులతో వెళ్తుండగా అడ్డుకున్న సెక్యూరిటీ
- అసెంబ్లీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన చంద్రబాబు
- రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని మండిపాటు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నాలుగో రోజు సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. అంతకు ముందు టీడీపీ అధినేత, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో వెళ్తుండగా వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తాము అసెంబ్లీకి వెళ్లడం లేదని, తమ కార్యాలయానికి వెళ్తున్నామని చెప్పినా వారు వినలేదు. సెక్యూరిటీ తీరును తీవ్రంగా నిరసించిన చంద్రబాబు, ఎమ్మెల్యేలు... అసెంబ్లీ ముందు బైఠాయించారు.
ఈ సందర్భంగా మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించిన ఆయన... మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాజకీయాలు నీచంగా ఉన్నాయని అన్నారు. తాము పేపర్లు తీసుకొస్తున్నా అడ్డుకుంటున్నారని చెప్పారు.