: సినీనటి మధురిమ సందడి
సినీనటి మధురిమ నగరంలో సందడి చేసింది. సరదాగా కేసేపు, మహంకాళి, షాడో సినిమాల్లో నటించి మురిపించిన మధురిమ హైదరాబాద్ శివారులోని అత్తాపూర్ లో ఎన్ మార్ట్ డిజిటల్ షాపును ప్రారంభించి, అభిమానులతో సందడి చేసింది. ఈ షాపులో అన్ని రకాల డిజిటల్ వస్తువులు అందుబాటులో ఉంటాయని ఆమె చెప్పింది. ముఖ్యంగా మహిళలకు కావాల్సిన అన్ని రకాల వంటసామాగ్రి సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపింది. తాను రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నానని, మరిన్ని మంచి పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను అలరిస్తానని మధురిమ చెప్పింది.