: తమిళ పార్టీలపై మండిపడ్డ లంకాధీశుడు
తమిళ మైనారిటీలు శ్రీలంకలోనే ఉండాలని ఆకాంక్షిస్తుంటే.. తమిళ పార్టీలు, ప్రవాసులు మాత్రం వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నారని అధ్యక్షుడు మహింద రాజపక్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్టీటీఈ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టే పునరావాస కార్యక్రమాలకు తమిళ సంఘాలు మద్దతివ్వడంలేదని ఆయన ఆరోపించారు. ఇలాంటి వ్యతిరేక వైఖరితో తమిళ సమాజం పతనం దిశగా సాగుతుందని రాజపక్స అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎల్టీటీఈ శకానంతరం తమిళ ప్రజలు లంకలోనే శాంతియుతంగా జీవించాలని భావిస్తున్నారని తెలిపారు. ఎల్టీటీఈతో దశాబ్దాల తరబడి సాగిన పోరాటం ముగిసి నేటితో నాలుగేళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన 'విక్టరీ డే' కార్యక్రమంలో రాజపక్స పాల్గొన్నారు. వేర్పాటు వేదాన్ని అనుమతిస్తే అది లంక దళాల ప్రాణత్యాగాన్ని అవమానించినట్టే అని పేర్కొన్నారు.