: 'మక్కా మసీదు పేలుళ్ల బాధితులకు న్యాయం చేయాలి'
2007 మే 18 జరిగిన మక్కా మసీదు పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబీకులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి, వారికి న్యాయం చేయాలని పలు స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు డిమాండ్ చేసారు. పేలుళ్లు జరిగి నేటికి ఆరేళ్లయినా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయలేదని ధ్వజమెత్తారు. మరో వైపు ఈ ఘటనలో ప్రభుత్వం పలువురు యువకులకు క్లీన్ చిట్ ఇచ్చినా పోలీసులు వేధిస్తున్నారంటూ ఆరోపించారు.