Chandrababu: పద్మజగారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను!: నారా లోకేశ్
- రాళ్లతో జగన్ దాడి చేయిస్తే పోలీసులకు భావ ప్రకటన స్వేచ్ఛగా కనిపించింది
- జగన్ గారి చెత్త పాలనపై మాట్లాడితే చట్ట వ్యతిరేక చర్యగా కనిపిస్తోంది
- వైకాపా, నాయకులకు మాత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందా?
ఏపీ మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలానికి చెందిన పద్మజ అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయంపై టీడీపీ నేత నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'చంద్రబాబు గారిపై చెప్పులతో, రాళ్లతో జగన్ గారు దాడి చేయిస్తే పోలీసులకు అది భావ ప్రకటన స్వేచ్ఛగా కనిపించింది. జగన్ గారి చెత్త పాలన చూసి కడుపు మండి ఒక మహిళ మాట్లాడితే పోలీసులకు అది చట్ట వ్యతిరేక చర్యగా కనిపించడం ఆశ్చర్యంగా ఉంది. పద్మజగారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను' అని ఆయన ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో వైకాపా మంత్రులు, నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందా? అని నారా లోకేశ్ నిలదీశారు. మంత్రులు బూతులు తిట్టినా, నీ అమ్మ మొగుడు అంటూ దుర్భాషలాడినా అది పవిత్రమైన భావ ప్రకటనా స్వేచ్ఛలా కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. 'ఎప్పటికీ మీరే అధికారంలో ఉండిపోతారు అనుకోవడం అవివేకం జగన్ గారు. వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ మీరు చేస్తున్న ప్రతి చర్య భవిష్యత్తులో మీ మెడకు చుట్టుకోవడం ఖాయం' అని ట్వీట్లు చేశారు.