Disha: దిశ హత్యాచార కేసు నిందితుల తల్లిదండ్రుల ఆవేదన ఇదీ..!

  • కూలి పనులు చేసుకుని బతుకుతున్నాం
  • లాయర్లను పెట్టుకునే స్తోమత మాకు లేదు
  • అరిఫ్ వల్లే మా పిల్లలు చెడిపోయారు

కూలి పనులు చేసుకుని జీవించే తాము కొడుకుల కోసం లాయర్లను పెట్టుకునే స్థితిలో లేమని దిశ హత్యాచార కేసులో నిందితుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని తాము లాయర్‌ను పెట్టుకోలేమని ఈ కేసులో ప్రధాన నిందితుడైన అరిఫ్ తండ్రి హుస్సేన్ తెలిపారు. తామిద్దరం అనారోగ్యంతో బాధపడుతున్నామని, కుమారుడే ఇప్పటి వరకు కుటుంబ పోషణ చూసుకునేవాడని తెలిపారు.

ఈ కేసులో రెండో నిందితుడైన జొల్లు శివ తండ్రి రాజప్ప మాట్లాడుతూ.. తన కుమారుడు తప్పు చేసినట్టు తేలితే ఎటువంటి శిక్ష విధించినా తమకు అభ్యంతరం లేదన్నారు. మూడో నిందితుడైన నవీన్ తల్లి లక్ష్మి మాట్లాడుతూ.. అరిఫ్ వల్లే తన కుమారుడు దారితప్పాడని ఆరోపించారు. 12 ఏళ్ల క్రితమే భర్త మరణించాడని, అప్పటి నుంచి కూలి పనులు చేసుకుంటూ కుమారుడిని పోషించినట్టు చెప్పారు. ఈ కేసులో నాలుగో నిందితుడైన చెన్నకేశవులు.. ఆరు నెలల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడంటే నమ్మలేకపోతున్నానని అతడి తల్లిదండ్రులు కురుమయ్య, జయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News