: మోడీని కలిసిన చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ్


కేంద్ర మంత్రి చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ్ రాజకీయాల్లో మామకు దీటుగా ఎదిగేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. హైదరాబాద్ బీజేపీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న భరద్వాజ్ తాజాగా గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని కలవడం ఆసక్తి కలిగిస్తోంది. భరద్వాజ్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీటును ఆశిస్తున్నట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీని అహ్మదాబాద్ లోని ఆయన నివాసంలో కలిసిన ఈ హైదరాబాదీ యువనేత గంటన్నర పాటు పలు అంశాలపై చర్చించాడు. వాటిలో తెలంగాణ అంశం కూడా ఉన్నట్టు సమాచారం.

ఈ సందర్భంగా, మోడీని భారత ప్రధానిగా చూడాలనుందన్న తన ఆకాంక్షను కూడా బయటపెట్టాడు భరద్వాజ్. ఈ విషయమై మాట్లాడుతూ, దేశానికి మోడీలాంటి వ్యక్తి నాయకత్వం అవసరమని చెప్పాడు. త్వరలోనే మోడీ రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చారని వెల్లడించాడు. భరద్వాజ్.. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను ప్రేమ వివాహం చేసుకోగా.. ఓ పాప పుట్టిన కొద్దికాలానికే వారి మధ్య పొరపొచ్చాలు రావడం.. వారిద్దరూ విడిపోవడం తెలిసిందే.

  • Loading...

More Telugu News