Chandrababu: కొత్త ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దామని మొదట్లో అనుకున్నాం: వైసీపీపై చంద్రబాబు విమర్శలు
- వైసీపీ ప్రభుత్వం తొలిరోజు నుంచే విధ్వంసకర పాలన మొదలుపెట్టింది
- ప్రజలకు నష్టం కలుగుతున్నప్పుడు ప్రతిపక్షంగా చూస్తూ కూర్చోలేం
- బాధితుల పక్షాన పోరాటం చేస్తున్నాం
వైసీపీ ఆరు నెలల పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ఈ ఆరు నెలల్లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేసే నిర్ణయాలు తీసుకుందని, దీంతో తాము పోరాటం కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చారు.
'కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని అనుకున్నాం. కానీ, వైసీపీ ప్రభుత్వం తొలిరోజు నుంచే విధ్వంసకర పాలన మొదలుపెట్టింది. ప్రజలకు నష్టం, కష్టం కలుగుతున్నప్పుడు ప్రతిపక్షంగా చూస్తూ కూర్చోలేం కాబట్టే బాధితుల పక్షాన అటు న్యాయపోరాటం, ఇటు రాజకీయ పోరాటం చేస్తున్నాం' అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.