: తెలంగాణ అంశం కేంద్రం పరిథిలో ఉంది: బొత్స
ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తొలిసారి స్పందించారు. తెలంగాణ అంశం కేంద్రం పరిథిలో ఉందన్న బొత్స, పార్టీని బలోపేతం చేయడం, స్థానిక ఎన్నికలకు సమాయత్తం దిశగా నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా ఈ నెల 22 న కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ, సమైక్యాంధ్ర అంశాలపై చర్చించటానికి పీసీసీ కార్యవర్గం ఉందన్నారు.