: విదేశీ విద్య గ్లోబల్ సమ్మిట్ ల సందడి


ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల కోలాహలం మొదలైంది. విద్యాసంవత్సరం ముగిసినందున, పలు పరీక్షల ఫలితాలు వెల్లడవడంతో హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. బేగంపేటలో ఏర్పాటు చేసిన సమ్మిట్ లో విదేశీ విద్యకు సంబంధించిన సమాచారం, వివిధ దేశాల్లో విద్యావకాశాలను తెలియజేసేందుకు ఢిల్లీకి చెందిన చోప్రాస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థ 16 దేశాలకు చెందిన వివిధ విశ్వవిద్యాలయాలతో ఇక్కడి విద్యార్థులకు ఇంటరాక్షన్ ఏర్పాటు చేసింది. దీనికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. విదేశాల్లో చదవాలనుకునే భారతీయ విద్యార్థులు డిగ్రీ కంటే పీజీ కోర్సుల్లో ప్రవేశాలే కోరుకుంటున్నారని ఆ సంస్థ ఎండీ నటాషా తెలిపారు.

  • Loading...

More Telugu News