: శ్రీశాంత్ తో కేరళ సర్కారు వాణిజ్య ప్రకటన నిలిపివేత


క్రికెటర్ శ్రీశాంత్ పై చిత్రీకరించిన లాటరీ వాణిజ్య ప్రకటనను కేరళ ప్రభుత్వం నిలిపివేసింది. శ్రీశాంత్ ఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అరెస్టవడంతో కేరళ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై కేరళ ఆర్ధిక మంత్రి కేఎమ్ మణి నేడు తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, శ్రీశాంత్ పై కేసు నమోదైన నేపథ్యంలో, లాటరీ వాణిజ్య ప్రకటనను కొనసాగించబోమన్నారు.

  • Loading...

More Telugu News